పెళ్లై మూడు రోజులు.. ప్రియురాలితో లాడ్జిలో రాసలీలలు.. చివరికి..

పెళ్లైన మూడురోజులకే లాడ్జిలో గర్ల్‌ఫ్రెండ్‌తో రాసలీలలు సాగించి అడ్డంగా దొరికిపోయాడో భర్త. ఆఫీస్ పనిమీద వెళ్తున్నానని చెప్పి పాస్ చూపించిన భర్త ప్రియురాలితో లాడ్జికి వెళ్లాడు. అది తెలియని భార్య నిజమని నమ్మింది. కానీ భర్త క్రెడిట్ కార్డు అతనిని పట్టించింది. విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించిన సంఘటన గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌‌లో వెలుగుచూసింది.

అహ్మదాబాద్‌కి చెందిన యువకుడికి ఇటీవల వివాహమైంది. ఈలోగా లాక్‌డౌన్ రావడంతో ఆఫీస్‌కి వెళ్లాలని భార్యకి చెప్పాడు. అత్యవసర సేవల కింద పొందిన పాస్ కూడా చూపించడంతో నమ్మేసింది. అయితే అతను ఆఫీస్‌కి వెళ్లకుండా భార్యకు అబద్ధం చెప్పి అదే ఏరియాలో లాడ్జిలో రూమ్ తీసుకుని సాగించాడు. లాక్‌డౌన్ ఉన్నా అందరి కళ్లుగప్పి ప్రియురాలితో ఎంజాయ్ చేశాడు.

Also Read:

ఓ రోజు భర్త క్రెడిట్ కార్డు బిల్ చూసిన భార్యకు అనుమానం వచ్చింది. తనకు ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన రోజు లాడ్జిలో బిల్లు కట్టినట్లు ఉండడంతో భార్యకి అనుమానం వచ్చింది. వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె సోదరుడు లాడ్జికి వెళ్లి ఆరా తీయడంతో సోదరి భర్త అమ్మాయితో లాడ్జిలో బస చేసినట్లు తేలింది. ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పి భర్త ప్రియురాలితో లాడ్జిలో ఎంజాయ్ చేసిన విషయం బయటపడడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here