అమ్మ సరుకులు తెమ్మంటే.. అమ్మాయిని తీసుకొచ్చిన కొడుకు.. తర్వాత ఏమైందంటే?

ఇంట్లోకి అవసరమైన సరుకులు తీసుకొస్తానని చెప్పిన కొడుకు.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగొచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతడి తల్లి కొడుకును, అతడితోపాటు వచ్చిన కొత్త కోడలిని ఇంట్లోకి రానీయలేదు. పుత్రరత్నం చేసిన పని పట్ల ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా తాను గడప దాటి బయటకు రాలేదని.. కానీ కొడుకు చేసిన పనికి పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.

ఆ జంట దగ్గర పెళ్లి చేసుకున్నామనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మ్యారేజీ సర్టిఫికెట్ ఇస్తానని వారికి పెళ్లి చేసిన పురోహితుడు చెప్పడం గమనార్హం. లాక్‌డౌన్ టైంలో పెళ్లి చేసుకుంటే.. ఎవరూ పెద్దగా గొడవ చేయరనే ఉద్దేశంతో ఆ యువతీయవకులు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.

వారు ముగ్గురూ పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియోను జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ట్వీట్ చేయగా.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. తల్లి ఇంట్లోకి సరుకులు తెమ్మని పంపిస్తే.. కొడుకు వంట మనిషిని తీసుకొచ్చాడని ఓ నెటిజన్ ఛలోక్తి విసరగా.. నేను రేపు సరుకులు కొనడానికి వెళ్తానంటూ మరొకరు ట్వీట్ చేయగా… ఏ షాపులో పెళ్లి కూతుళ్లను విక్రయిస్తున్నారంటూ మరొకరు కొంటెగా స్పందించారు. ఇలాంటి పనులు యూపీ కుర్రాళ్లు మాత్రమే చేయగలరని మరొకరు రిప్లయ్ ఇచ్చారు. ఇంకొందరైతే… పురోహితుడు సర్టిఫికెట్ ఇప్పించడం ఏంటంటూ.. సహేతుకమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here