పారిపోయిన కూతురు.. చంపి పాతిపెట్టిన కసాయి తల్లి.. పోలీసుల ఎంట్రీతో షాక్

కూతురు ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందన్న ఆగ్రహంతో రగిలిపోయిన తల్లి దారుణానికి ఒడిగట్టింది. స్వగ్రామానికి తీసుకెళ్లి కన్నకూతురిని అమానుషంగా చంపేసి పాతిపెట్టింది. శవాన్ని కూడా మాయం చేసేసి చేతులు దులుపుకుంది. అక్కడి నుంచి తాము నివాసం ఉంటున్న నగరానికి వెళ్లిపోయింది. అయితే ఊహించిన విధంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగి కటకటాల పాలైంది. ఈ దారుణ రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

పాలి జిల్లాలోని సొనాయ్ మజి గ్రామానికి చెందిన సవారామ్, శేషారామ్ కుటుంబాలు కొన్నేళ్ల కిందట పూణెకి వలస వెళ్లాయి. అక్కడే కిరాణా దుకాణం నడుపుకుంటూ స్థిరపడ్డాయి. శేషారామ్ కుమార్తె రింకు(16) పూణెలో ఓ యువకుడిని ప్రేమించింది. రెండు నెలల కిందట అతనితో వెళ్లిపోయింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రేమ జంటను దబర్ రైల్వే స్టేషన్‌లో పట్టుకుని బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Also Read:

యువకుడు కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుకెళ్లాడు. అతను బెయిల్‌పై బయటకి వచ్చినప్పటి నుంచి ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని బాలిక కుటుంబ సభ్యులను కోరుతోంది. ప్రియుడితో పారిపోయి కుటుంబం పరువు తీసిందని ఆగ్రహంతో రగిలిపోయిన తల్లి సీతాదేవి, బాబాయ్ సవారామ్ దేవుడి కార్యక్రమం ఉందని చెప్పి బాలికను స్వగ్రామం సొనాయ్ మజి తీసుకెళ్లారు. అక్కడే బాలికను దారుణంగా చంపేసి తగులబెట్టారు. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు.

అంతా అయిపోయిందని చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. అయితే ఊహించని విధంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో షాక్‌కి గురయ్యారు. బాలికను చంపి పాతిపెట్టారంటూ విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలికను పాతిపెట్టిన చోట తవ్వించి కాలిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి తల్లి సీతాదేవి, బాబాయ్ సవారామ్‌ను అరెస్టు చేసి జైలుకి పంపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here