పాప మొదటి పుట్టినరోజు కోసం తల్లి లేఖ.. స్పందించిన సీఎం

క రోనా మహమ్మారి రోజురోజుకి ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పుట్టినరోజులు, పెళ్లిళ్లు తదితర శుభకార్యాలు జరుపుకోవడానికి వీల్లేకుండాపోయింది. అయితే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన పాప తొలి పుట్టినరోజు సందర్భంగా ఎలాగైనా వేడుకలు నిర్వహించుకోవాలని భావించింది. పిల్లల తొలి బర్త్‌డే అంటే తల్లిదండ్రులకు ఎంతో మధురమే కదా. అనుకున్నదే తడవుగా ఆ మహిళ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓ ట్వీట్ చేసింది.

‘మా పాప మొదటి పుట్టినరోజు జరుపుకునే వీలు లేకపోవడం బాధిస్తోంది. ఆ ఆనంద క్షణాలను ప్రత్యేకంగా మలచుకోవడానికి అవకాశం ఇవ్వండి’ అని సదరు మహిళ కోరింది. దీనికి సీఎం యోగి వెంటనే స్పందించారు. పాప ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో మథుర పోలీస్ అధికారులు అర గంటలో అక్కడికి చేరుకొని పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here