పనిమనిషి లవ్ అఫైర్? యజమాని అపార్ట్‌మెంట్ నుంచి దూకేసి..

మూడేళ్లుగా పనిచేస్తున్న ఇంటి యజమాని అపార్ట్‌మెంట్ నుంచి దూకి చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ప్రేమలత టింగా(22) ముంబైలోని ఖర్ ప్రాంతంలో ఉన్న పార్క్ విస్టా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ప్రియాంక అసాని దంపతుల ఇంట్లో పనిచేస్తోంది. ఇంటి పనులు చేయడంతో పాటు వారి పిల్లలను కూడా చేసుకునేది. మూడేళ్లుగా అదే ఇంట్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

సడెన్‌గా ఆమె అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తు నుంచి అమాంతం దూకేసింది. అది చూసిన పెంపుడు కుక్క అరవడం మొదలుపెట్టింది. అప్రమత్తమైన యజమాని ప్రియాంక వచ్చి చూడడంతో ప్రేమలత అపార్ట్‌మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్‌కి గురైంది. సమాచారం అందుకున్న ఖర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య కారణాలపై ఆరా తీశారు.

Also Read:

అయితే ప్రేమలత ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు. ప్రియుడితో బ్రేకప్ అవడంతో మానసికంగా కుంగిపోయిందని.. ఆ డిప్రెషన్‌లోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని భావిస్తున్నారు. మృతురాలి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. బిల్డింగ్ పై నుంచి దూకిన సమయంలో పిట్టగోడ తగిలి ఆమెకి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here