పనిచేయని ప్లాస్మా థెరపీ.. కరోనా రోగి మృతి

మ హారాష్ట్రలో ద్వారా చికిత్స పొందిన తొలి కరోనా రోగి మృతి చెందాడు. వైద్యులు అతడిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని లీలావతి ఆసత్పి వర్గాలు తెలిపాయి. 10 రోజుల కిందట అతడిని ఆస్పత్రిలో చేర్పించే నాటికే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆ తర్వాత ఏమాత్రం కోలుకోలేదని వివరించారు. 53 ఏళ్ల ఆ రోగిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించి బుధవారం (ఏప్రిల్ 29) అర్ధరాత్రి తర్వాత అతడు మరణించినట్లు వెల్లడించారు.

సదరు రోగికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వివరించారు. ఆస్పత్రిలో చేర్పించిన వెంటనే అతడి పరిస్థితి గమనించి మెరుగైన చికిత్స అందించామని.. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి నుంచి ప్లాస్మా సేకరించి కొద్ది రోజుల కిందట 200 ml డోస్ ఇచ్చామని తెలిపారు. అంతకుముందు ఇతర ఔషధాలతో ప్రయత్నించామని చెప్పారు. అతడి ప్రాణాలు కాపడటానికి చివరి నిమిషం వరకు ప్రయత్నించామని వివరించారు.

ఆరోగ్య పరిస్థితి బాగా విషమించిన వారికే ప్లాస్మా థెరపీ విధానం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వైద్యుల్లోనూ నిరుత్సాహం కలుగుతుందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్లాస్మా చికిత్స అందుకున్న తొలి వ్యక్తి ఇతడే కావడం గమనార్హం.

Also Read:

ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ రెండు రోజుల కిందట పేర్కొన్నారు. కరోనా నివారణకు ఈ థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవని.. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్లాస్మా థెరపీ పద్ధతిని వినియోగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్లాస్మా చికిత్సను సరైన పద్ధతిలో అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కరోనాను జయించిన వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరించి.. అందులోని ప్లాస్మాను కరోనాతో బాధపడే వ్యక్తికి ఎక్కించడాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. ఈ చికిత్స కొన్ని చోట్ల మంచి ఫలితాలను ఇచ్చింది. దీంతో కరోనాను జయించిన చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు.. ప్లాస్మా థెరపీ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, ఈ చికిత్సా విధానాన్ని నిలిపి వేయడం కుదరదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ రోగుల్లో ప్లాస్మా థెరపీ ప్రభావంతంగా పనిచేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. ఇటీవల ఓ కరోనా రోగి పరిస్థితి విషమించడంతో అతడికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిచామని.. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడని ఆయన వివరించారు. ఇటు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి అనుమతులు ఇచ్చినా.. కేంద్రం ఆదేశాలతో ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Must Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here