పదేళ్ల బాలికపై అత్యాచారం.. గుంటూరులో దారుణం

మహిళలు, చిన్నారుల రక్షణకు కఠిన చట్టాలు చేసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడోచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు తెగబడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.

మనవరాలి వయసున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. కామంతో కళ్లుమూసుకుపోయి పదేళ్ల బలికను రేప్ చేశాడు. ఈ దారుణ ఘటన నాదెండ్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులు మిర్చి కోతలకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన ప్రకాశరావు(59) బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read:

ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బాలికను రేప్ చేశాడు. పొలం పనుల నుంచి ఇంటికి తిరిగొచ్చిన తల్లదండ్రులకు విషయం తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here