పక్కింటి కుర్రాడు పిలిచాడని వెళ్లిన ఇంటర్ బాలిక.. అర్ధరాత్రి దారుణం

సరదాగా కలుద్దామంటూ పక్కింటి కుర్రాడు పిలవడంతో వెళ్లిన బాలిక అత్యాచారానికి గురైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బాలికను దారుణంగా రేప్ చేసిన యువకుడు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకి చెప్పుకుని భోరుమనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని వెంటబెట్టుకుని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

గ్వాలియర్‌లోని గిర్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్టరీ ఏరియాకి చెందిన బాలిక(16) పదకొడో తరగతి చదువుతోంది. ఆమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడు షాని అలియాస్ సన్నీ పరిహార్ అనే యువకుడితో ఆమెకు పరిచయమైంది. సన్నీ కుటుంబం ఐదు నెలల కిందటే బాలిక ఇంటికి సమీపంలోని ఇంట్లో అద్దెకు దిగింది. అతనితో చనువు పెరిగి సెల్‌ఫోన్ నంబర్లు మార్చుకున్నారు.

Also Read:

లాక్‌డౌన్‌తో సన్నీ తల్లిదండ్రులు సమీపంలోని గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో బాలికకు ఫోన్ చేసిన సన్నీ.. ఇంట్లో ఎవరూ లేరు సరదాగా కలుద్దామని అడిగాడు. అందుకు అంగీకరించిన బాలిక ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతని ఇంటికి వెళ్లింది. అదే అదనుగా భావించిన దుర్మార్గుడు బాలికను దారుణంగా రేప్ చేశాడు. ఉదయం వరకూ నరకం చూపించి తెల్లవారుజామున ఆమె ఇంటి వద్ద వదిలేశాడు.

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన దారుణాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలిని వెంటబెట్టుకుని ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మైనర్ బాలికపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here