‘నా భర్త కరోనాతో పోయాడు..’ భార్య దొంగేడుపు.. పక్కింటోళ్లకి అనుమానం రావడంతో..

ప్రియుడితో కలసి భర్తను చంపేసి హైడ్రామాకు తెరతీసిందో ఇల్లాలు. తన భర్త కరోనాతో చనిపోయాడంటూ కట్టుకథ అల్లి హడావిడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయిస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కరోనాతో చనిపోతే అంత్యక్రియలకు ఏర్పాటు చేయడమేంటని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. అనుమానంతో డెడ్‌బాడీని పోస్టుమార్టానికి పంపడంతో భార్య అసలు బాగోతం బయటపడింది. ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.

ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన శరత్ దాస్(46) అతని భార్య అనిత(30)తో కలసి నివాసం ఉంటున్నాడు. సడెన్‌గా ఓ రోజు ఉదయం దాస్ మరణించాడని.. కరోనా కారణంగా ప్రాణాలు విడిచాడని భార్య ఇరుగుపొరుగుకు చెప్పింది. వెంటనే దాస్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయిస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దాస్ ఎలా చనిపోయాడన్న విషయమై అనితను ఆరా తీశారు.

Also Read:

ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులకు అనుమానాలు రేగాయి. కరోనాతో చనిపోతే డాక్టర్ రిపోర్ట్స్ చూపించాలని అడగడంతో భార్య తెల్లమొహం వేసింది. దీంతో దాస్ మరణంపై అనుమానాలు బలపడ్డాయి. తక్షణం అంత్యక్రియల ఏర్పాట్లు నిలిపివేయించి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఊహించినట్టే పోస్టుమార్టం రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

దాస్ అనారోగ్యంతో చనిపోలేదని.. ఎవరో ఊపిరాడకుండా చేసి చంపేశారని తేలింది. దీంతో పోలీసులు మృతుడి భార్య అనితను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేసింది. తనకు సంజయ్ అనే మరో యువకుడితో ఉందని.. అది తెలిసినప్పటి నుంచి తన భర్త వేధింపులకు గురిచేయడంతో అంతమొందించినట్లు ఒప్పుకుంది. ప్రియుడు సంజయ్‌తో కలసి ముఖానికి దిండు అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here