గంగా నది జలాలతో కరోనా నశిస్తుందా.. ఐసీఎంఆర్ ఏం చెబుతోంది?

గం గా నది జలాలతో నశిస్తుందా.. దేశంలో కొంత కాలంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. గంగా నది జలాలకు వైరస్‌లను నశింపజేసే శక్తి ఉందని.. కరోనా వైరస్‌ను నియంత్రిస్తుందేమో పరిశోధన చేయాలని కేంద్ర జల శక్తి వనరుల శాఖకు లెక్కలు మిక్కిలి విజ్ఞప్తులు వస్తున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఇదే డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర జల శక్తి వనరుల శాఖకు చెందిన ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా’.. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి కీలక ప్రతిపాదన చేసింది. గంగా జలాలపై పరిశోధనలు చేయాల్సిందిగా కోరింది.

పవిత్ర గంగా జలంతో వివిధ రోగాలు నయమైనట్లు పురాణాలు చెబుతున్నాయని మాజీ సైనిక అధికారులతో కూడిన ఓ స్వచ్ఛంద సంస్థ కూడా పేర్కొంది. గంగా జలాలకు బాక్టీరియాను చంపే శక్తి ఉండటం వల్ల ఈ నదీ జలాలను ‘నింజా వైరస్‌’గా పిలుస్తారని పలువురు పేర్కొంటున్నారు. గంగా జలాలతో పలు వ్యాధులు నివారణ అయినట్లు పలు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

Must Read:

ఈ నేపథ్యంలో కరోనా క్లినికల్‌ అధ్యయనానికి గంగా జలాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌ఎంసీజీ (గంగా ప్రక్షాళన జాతీయ మిషన్‌) ఐసీఎంఆర్‌కు లేఖ రాసింది. స్వచ్ఛమైన గంగా జలంలో వైరస్‌తో పోరాడే యాంటీ వైరల్‌ గుణం ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో తమ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఏప్రిల్‌ 28న రాసిన ఈ లేఖలో కోరింది. ఈ లేఖను పరిశీలించిన ఐసీఎంఆర్‌ పరిశోధకులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

గంగా జలంతో రోగాలు నయం అవుతాయనడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం, ఆధారాలు సరిపోవని ఐసీఎంఆర్ పేర్కొంది. అందువల్ల గంగా జలంతో క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన అధ్యయనం చేయలేమని స్పష్టం చేసింది. ఎవల్యూషన్‌ ఆఫ్ రీసెర్చ్‌ ప్రపోజల్స్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ వైకే గుప్తా నేతృత‍్వంలోని బృందం తమ నిర్ణయాన్ని ఐసీఎంఆర్‌కు తెలిపింది. ఈ ప్రతిపాదనలకు బలం చేకూర్చేందుకు మరింత శాస్త్రీయ ఆధారాలు, సమాచారం కావాలని వైకే గుప్తా పేర్కొన్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here