నాగ‌బాబు, సుధీర్ మ‌ధ్య చిచ్చుపెట్టిన రామోజీరావు

అడాల్డ్ కామెడీతో బుల్లితెర‌పై పొట్ట‌చెక్క‌ల‌య్యేలా చేస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్. ఈ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. గ‌తంలో క‌మెడియ‌న్ ఆలి చేసిన చిన్న‌చిన్న బూతు సెటైర్ల‌కు ఫిల్మిం ఇండ‌స్ట్రీలో పెద్ద ర‌చ్చ జ‌రిగింది. దీనికి ఆలి క్ష‌మాప‌ణ చెప్పాడు అదిగతం. కానీ సీను మారింది. బూతులేందే స్కిట్ ను ఎంజాయ్ చేసే జ‌నాలు త‌గ్గిపోయారు. జ‌బ‌ర్ధ‌స్త్ చూసేదే బూతు కామెడీకోస‌మే న‌ని ఆ షోకు చెందిన ఆర్టిస్టులు చెప్పిన సంద‌ర్భాలున్నాయి. అయితే ఎక్స్ ట్రా జబర్దస్ షో కోసం రెండు రోజుల క్రితం ఓ ప్రోమోను విడుద‌ల చేసింది . అందులో సుదీర్, రాం ప్రసాద్, గెటప్ శీను కు  యాంకర్ రష్మీకి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీనికి స్పందించిన జడ్జ్ నాగ‌బాబు సుధీర్ టీ పై కోపం తెచ్చుకున్నాడు.  పొగ‌రెక్కువై స్కీట్ లు స‌రీగా చేయ‌డంలేదంటూ అనడంతో.. వెంటనే గెటప్ శీను.. నాగబాబు, రోజాలనుద్దేసించి మీరు స్కిట్ చేయండి అని  అన్నాడు.  దీంతో కంగుతిన్న నాగ‌బాబు సెట్ నుంచి వెళ్లిపోవాల‌ని వార్నింగ్ ఇవ్వడంతో గొడవ స‌ర్ధుమ‌ణిగింది. ఇదీ విష‌యం.
 కానీ అక్క‌డ వేరేలా జ‌రుగుతుంద‌ని  మారో రూమ‌ర్ వినిపిస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్ శ్యాంప్రసాద్ రెడ్డి, దీన్ని ప్ర‌సారం చేసేది ఈటీవీలో.ఈటీవీ రామోజీరావుది. అయితే వీళ్లిద్ద‌రే ఈ వివాదాన్ని తెర‌వెన‌క నుంచి న‌డిపిస్తున్నార‌ని టాక్. బూతుకామెడీ తో మొహంమొత్తిన జ‌నాల‌కు కొత్త ఫందాలో వెళితే షో గురించి చ‌ర్చించుకుంటార‌నే ఉద్దేశంతో షోను ఇలా న‌డిపించిన‌ట్లు గుస‌గుస‌. స్కిట్ చేసే క‌మెడియ‌న్ బ‌ట్టి జ‌నాలు చూస్తారు. దాన్ని అంచ‌నా వేసి ర‌ష్మీని,సుధీర్ ను రంగంలోకి దించారు. కానీ విరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతుంద‌ని గ‌తంలో పుకార్లు షికార్లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో రూటు మార్చిన ఈ ఉద్దండులు రాంప్రసాద్, గెటప్ శీనును ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయించారు. ఇలా ర‌ష్మీ,సుధీర్ ప్రేమాయ‌ణం పేరుతో షోను మ‌రింత ఆక‌ట్టుకునేలా  చేశార‌నేది బుల్లితెర క్రిటిక్స్ టాక్. ఏది ఎలా ఉన్నా జ‌నాల్ని ఆక‌ట్టుకోవండంలో కొత్త‌గా ఆలోచించ‌డం అనేది అభినందించ ద‌గ్గ విష‌య‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here