కాటమరాయుడుకు 3 రోజుల్లోనే వంద కోట్లా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ బజ్ కాటమరాయుడు.. డివైడ్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ కంటే సినిమా బెటరన్న ప్రచారం నుంచి.. కాటమరాయుడు సూపర్ హిట్ అన్న టాక్ ను సొంతం చేసుకుంటోంది. ఈ సినమా వసూళ్ల గురించి అన్ అఫిషియల్ గా ఓ సూపర్ టాక్ ప్రచారంలోకి వచ్చింది.

3 రోజుల్లోనే కాటమరాయుడు సినిమా వంద కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్ సీస్ లోనూ అంచనాలకు మించి వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది.

ఓవరాల్ గా మొదటి రోజు 42 కోట్ల రూపాయలు.. రెండో రోజు 30 కోట్లు.. మూడో రోజు 28 కోట్ల రూపాయల షేర్ సాధించి.. 3 రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దగ్గర్లో పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో.. కాటమరాయుడు సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

అయితే.. 3 రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన విషయాన్ని.. కాటమరాయుడు యూనిట్ కు సంబధించి.. ఇంతవరూ ఎవరూ అఫిషియల్ గా కన్ఫమ్ చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here