నర్సుల సేవలకు అభినందనలు: ప్రధాని మోదీ

న ర్సులు, వారి కుటుంబాలకు మనం ఎంతో రుణపడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. అంతర్జాతీయ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడే నర్సుల సేవలు అభినందనీయమని మోదీ ప్రశంసించారు. ప్రపంచం ఆరోగ్యంగా ఉండేందుకు నర్సులు 24 గంటలూ అవిశ్రాంతంగా శ్రమిస్తారని కొనియాడారు. ప్రస్తుతం కోవిడ్‌-19 మహమ్మారిని ఓడించేందుకు వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కీర్తించారు. నర్సుల సేవలను కీర్తిస్తూ ప్రధాని మోదీ మంగళవారం (మే 12) మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు.

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ స్ఫూర్తితో మన నర్సులు అంకితభావంతో తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సమాజ హితం కోసం పనిచేస్తున్న నర్సులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. నర్సుల సంక్షేమానికి ఈ రోజు మనంపునరంకితం కావాలని, ఈ రంగంలోకి పెద్ద సంఖ్యలో పలువురు వచ్చేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జయంతిని ఆధునిక నర్సింగ్‌ సేవలకు గుర్తుగా ‘ప్రపంచ నర్సుల దినోత్సవం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఆమె 200వ జయంతి కావడం విశేషం.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here