దేశంలో 70 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. గత 24 గంటల్లో 3640 కొత్త కేసులు నమోదు కాగా.. 87 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలోని కోవిడ్ బాధితుల సంఖ్య 70,756కు చేరింది. ఇప్పటి వరకూ మన దేశంలో 22,454 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2293 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో 46,008 యాక్టివ్ కేసులున్నాయి.

అంతకు మందు 24 గంటల్లోనే 4200 కరోనా కేసులు నమోదయ్యాయని సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన తరుణంలో కరోనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

సోమవారం సాయంత్రం రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన ప్రధాని మోదీ.. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ తదితర అంశాల గురించి చర్చించిన సంగతి తెలిసిందే. కొందరు సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పుడే రైళ్లను నడపొద్దని కోరారు. మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అనారోగ్యం కారణంగా ఇటీవల హాస్పిటల్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా టెస్టులు చేయగా.. నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు స్పందిస్తున్నారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here