20 నిమిషాల్లో రైలు టికెట్లు ఖాళీ… సైట్ క్రాష్ అయిందంటూ ఫిర్యాదులు

లాక్‌డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా దేశవ్యాప్తంగా గూడ్సు రైళ్లు మినహా అన్ని రకాల రైళ్లను కేంద్రం నిలిపివేసింది. ప్యాసింజర్ ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయన్న సంగతి తెలిసిందే. గూడ్స్ రైళ్లు, వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్లు మాత్రమే ఇప్పటివరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్యాసింజర్ ట్రైన్స్‌ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మే 12 నుంచి దశలవారీగా ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

2020 మే 11 న సాయంత్రం 4 గంటలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటిసీ) వెబ్‌సైట్ మరియు రైల్ కనెక్ట్ యాప్ నుంచి టికెట్లు బుకింగ్ మొదలయ్యింది. అయితే టికెట్లు సాయంత్రం నాలుగు గంటలకే అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించినా, వెబ్‌సైట్లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యం అయింది. మే 12 నుండి నడుస్తున్న రైళ్ల సమాచారాన్ని అప్‌లోడ్ చేయలేదని, అందువల్ల సాయంత్రం 6 గంటల నుండి బుకింగ్ చేయబడుతుందని రైల్వేశాఖ చెప్పింది. దీంతో ప్రజలు ఆరు గంటల నుండి IRCTC వెబ్‌సైట్ మరియు రైల్ కనెక్ట్ సైట్లలో యాప్‌లలో బుకింగ్ ప్రారంభించారు.

అయితే ఆరు గంటలకు బుకింగ్ ప్రారంభమైనా కూడా చాలా మందికి లోపం మారలేదు. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ మరియు యాప్‌లో లాగిన్ అయినప్పుడు, కరోనా కారణంగా తదుపరి ఆర్డర్ వరకు బుకింగ్ మూసివేయడింది అంటూ నోటిఫికేషన్ వచ్చింది. దీని తరువాత, రైల్వే నుంచి ఒక ప్రకటన వచ్చింది. 10 నిమిషాల్లో హౌరాకు వెళ్లే రైలు టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. అయినప్పటికీ వెబ్‌సైట్ క్రాష్ అవుతున్నట్లు చాలా మంది ఫిర్యాదు చేశారు. హౌరా-ఢిల్లీ మధ్య నడిచే రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు కేవలం పది నిమిషాల్లోనే అమ్ముడుపోగా, మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. భువనేశ్వర్-ఢిల్లీ రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు అరగంటలోనే అమ్ముడైపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here