దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదు, కొన్ని రాష్ట్రాలు సరైన వివరాలు ఇవ్వట్లేదు: లవ్ అగర్వాల్

దే శంలో కరోనా రికవరీ రేటు 27.41 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాక సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. 24 గంటల్లో 195 మంది మరణించారని వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తికి చేరలేదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల నుంచి ఆలస్యంగా నివేదికలు అందుతున్నాయని, సమగ్ర వివరాలు ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో కరోనా వ్యాప్తిపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 46,433కు చేరుకుంది. కరోనా కారణంగా భారత్‌లో ఇప్పటివరకు 1568 మంది మరణించారు. 12,727 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మే 7 నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొస్తామని లవ్ అగర్వాల్ తెలిపారు. వారంలోగా ఈ తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

వలస కూలీల తరలింపునకు 62 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు 67 వేల మంది కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. మంగళవారం (మే 5) 13 శ్రామిక్ రైళ్లు నడిపినట్లు వెల్లడించారు. వేలాడి మంది వలస కూలీలు స్వస్థాలకు చేరుకున్నారని తెలిపారు. కూలీల తరలింపుకయ్యే ఖర్చులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని స్పష్టం చేశారు.

స్వదేశీ గడ్డకు చేరుకోగానే ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే భారతీయులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. స్వదేశానికి రాగానే వారు ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here