దాల్చిన చెక్క‌తో అనేక లాభాలు! .. అవి ఏమిటి అంటే

దాల్చిన చెక్క‌తో అనేక లాభాలు!

ఆధునిక జీవ‌న శైలిలో ప్ర‌తి చిన్న ఆరోగ్య స‌మ‌స్య‌కు మ‌నం వైద్యుల‌పై ఆధార‌ప‌డుతున్నాం. జ‌లుబు, ద‌గ్గుల‌కు కూడా టాబ్లెట్లు, టానిక్ లు వాడేస్తున్నాం. వాటిని నివారించ‌డానికి మ‌న పెద్ద‌లు ఆవిరి ప‌ట్ట‌డం వంటి చిట్కాల‌ను ఉప‌యోగించేవారు. అంతేకాదు, వంటింటి చిట్కాల‌తోనే దీర్ఘ కాలిక వ్యాధుల‌ను కూడా మ‌న పెద్ద‌లు న‌యం చేసేవారు. మ‌నం దాల్చిన చెక్క‌ను కేవ‌లం మ‌సాలా దినుసుగానే ట్రీట్ చేస్తాం. కానీ, దాల్చిన చెక్క‌తో ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. డ‌యాబెటిస్‌, కేన్స‌ర్ వ్యాధికార‌క క‌ణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క కీల‌క‌మైన పాత్ర పోషిస్తుందట‌.

దాల్చిన చెక్క వ‌ల్ల నిత్య జీవితంలో అనేక లాభాలున్నాయ‌ట‌. దాల్చిన చెక్క‌కు రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరించే గుణం ఉంద‌ట‌. డయాబెటిస్‌ (టైప్‌ 2 డయాబెటిస్‌) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.  దాల్చిన చెక్క పొడిని రోజుకు అర టీ స్పూన్‌ తీసుకుంటే  గుండెకు హాని చేసే (ఎల్‌డిఎల్‌)కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించ‌వ‌చ్చ‌ట‌. ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్‌) వంటి క్యాన్సర్‌ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు తెలిపారు.

ఔషధపరంగా దీని ఉపయోగాలు చెప్పలేనన్ని ఉన్నాయి. నోటిదుర్వాసన, దగ్గు, పంటినొప్పులను తగ్గించడానికి ఇది పెట్టింది పేరు. స్వరపేటిక వాపు, గొంతు బొంగురు పోవడం, గొంతులో గురగురలు వంటి వ్యాధులు ఉన్నవారు దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని, ఆ ఊటను నమిగిలి మింగుతూ ఉంటే నివారణ జరుగుతుంది.

ప్ర‌తిరోజు పరగడుపున అర టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య తగ్గుతుంది. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా దీనిని తీసుకుంటే ఆర్థరైటిస్ బారి నుండి విముక్తి పొంద‌వ‌చ్చ‌ట‌. ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా దాల్చిన చెక్క ప్రిజర్వేటివ్ గా కూడా ప‌నిచేస్తుంద‌ట‌. రోజూ ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క పొడి చిటికెడు వేసి మరిగించి కొద్దిగా  తేనెతో క‌లిపి తాగ‌డం ఆరోగ్యానికి మంచిద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here