మెగా స్టార్ చిరంజీవిసైరా సినిమా డైలాగులు లీక్..

మెగా స్టార్ చిరంజీవిసైరా సినిమా డైలాగులు లీక్..

మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇప్పుడు యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ విడుదల అయ్యి వారం అవుతున్నా ఇంకా ఆ వీడియో టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉంది. దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ తో తెరకి ఎక్కుతున్న ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా ఇప్పటికే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇతర హీరోయిన్  ల కోసం స్వీటీ అనుష్క , బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ లతో మాటలు నడుస్తున్నాయి. ఈ సినిమా కి సంబంధించి తాజాగా కొన్ని డైలాగులు ఆన్ లైన్ లో లీక్ అవ్వడం తో మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పరుచూరి బ్రదర్స్ తో పాటు సాయి మాధవ్ బుర్రా కూడా డైలాగులు రాస్తూ ఉండడం తో మెగా ఫాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  ‘ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చెయ్యి మీసం మీదకి పోయే సరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా’ అన్న డైలాగ్  ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది దాంతో ఫాన్స్ ఈ సినిమా మీద ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here