రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధ‌ర‌..

బంగారం ధ‌ర‌లు ఇప్పుడే త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సి వ‌స్తే ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గుతాయ‌న్న న‌మ్మ‌క‌మూ లేదు. మొన్న‌నే 50 వేలు దాటిన బంగారం.. ఇప్పుడు మళ్లీ పెరిగిపోతోంది.

మునుపెన్న‌డూ లేనంతగా బంగారం ధ‌ర మొన్న 10 గ్రాములు 50వేల రూపాయ‌లు క్రాస్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇప్పుడు రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే రూ. 1500 ఎగ‌బాకింది. హైద‌రాబాద్‌లో సోమ‌వారం బులియ‌న్ విప‌ణిలో మేలిమి బంగారం 10 గ్రాములు రూ. 54వేలుకు చేరిందంటే అర్థం చేసుకోవ‌చ్చు ధ‌ర ఏర‌కంగా పెరుగుతుందో.

అయితే ఈ ధ‌ర‌ల ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించడం లేదు. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో అన్నింటిలో ధ‌ర‌లు ఒడిదొడుకుల‌ను ఎదుర్కొన్నా బంగారం ధ‌ర‌లు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది ఇలాగే కొన‌సాగుతుంద‌ని ప‌లువురు విశ్లేశిస్తున్నారు. ఆర్థిక వృద్ధి మంద‌గించ‌డంతో పాటు డాల‌ర్ విలువ త‌గ్గుతుండ‌టంతో బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here