మ‌ర్డ‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన వ‌ర్మ‌.. ఈసారి టార్గెట్ ఎవ‌రు..?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ మ‌రో మూవీ ఇప్పుడు వ‌చ్చేస్తోంది. అయితే ఈ సారి వ‌ర్మ ఎవ్వ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. స‌మాజంలో ఏం జ‌రుగుతుందో తెర‌పై చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మిర్యాల‌గూడ‌లో మారుతీరావు కూతురు అమృత ప్రేమ వివాహం ఎంత వ‌ర‌కు వెళ్లిందో అంద‌రికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ఇదే అంశంపై రాం గోపాల్ వ‌ర్మ మ‌ర్డ‌ర్ అనే టైటిల్‌తో సినిమాను తీస్తున్నారు. ఈ మేర‌కు గ‌తంలోనే ఆయ‌న ప్ర‌క‌టించారు.

సినిమా ట్రైల‌ర్‌ను వ‌ర్మ‌విడుద‌ల చేయ‌గా.. ఎలాంటి మాటలు లేకుండా ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే ట్రైల‌ర్ సాగిపోతుంది. ప్రేమించ‌డం త‌ప్పా.. త‌ప్పు చేస్తే దండించ‌డం త‌ప్పా అంటూ స్కీన్‌పై ఇలా నాలుగైదు సంభాష‌ణ‌లు వెళుతూ ఉంటాయి.

ఒక ప్రేమ క‌థ రెండు కుటుంబాల‌ను ఎలా ఛిన్నాభిన్నం చేసింద‌న్న దానిపై ఈ సినిమాను వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాళం బాష‌ల్లో ట్రైల‌ర్‌ను వ‌ర్మ రిలీజ్ చేశారు. అమృత పాత్ర‌లో ఆవంచ సాహితీ, శ్రీ‌కాంత్ అయ్యంగార్ మారుతీరావు పాత్ర‌లో న‌టిస్తున్నారు. వ‌ర్మ మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. వెంట‌నే ఇప్పుడు మ‌ర్డ‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చెయ్య‌డంతో అంతా ఉత్కంఠ‌గా చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here