దండం పెడ‌తాను.. ఇలాంటివి న‌మ్మొద్దు.. సింగ‌ర్ సునీత‌

త‌న పేరు చెప్పుకొని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న్న వార్త‌ల‌పై ప్ర‌ముఖ సింగర్ సునీత స్పందించారు. ఫేస్‌బుక్ ద్వారా ఆమె ఆక‌తాయిల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సింగర్ సునీత మేన‌ల్లుడినంటూ అనంత‌పురం జిల్లాలో చైత‌న్య అనే వ్య‌క్తి చ‌లామ‌ణీ అవుతున్నాడని ఇటీవ‌ల ఓ పేప‌ర్‌లో వార్త ప్ర‌చురిత‌మైంది. ఇందులో ఏముందంటే సునీత త‌న‌కు బాగా తెలుస‌ని చైత‌న్య అంద‌రితో చెప్పుకునేవాడు. చాలా మంది వ‌ద్ద డ‌బ్బుల వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డాడు. మొత్తానికి ఈ విష‌యం సింగ‌ర్ సునీత‌కు చేరింది.

దీనిపై సునీత స్పందించారు. త‌న‌కు చైత‌న్య అనే మేన‌ల్లుడు లేర‌ని.. అసలు చైత‌న్య అనే వ్య‌క్తి త‌న‌కు తెలియ‌ద‌న్నారు. త‌న పేరు చెప్పుకొని ఇలా అంద‌రినీ మోసం చేస్తున్నార‌ని తెలియ‌డంతో బాధేసింద‌న్నారు. ఈ వ్య‌క్తి ఎదురైతే ప‌ళ్లు రాలిపోతాయ‌న్నారు. ఇలా త‌న పేరు చెప్పుకునే వ్య‌క్తులెవ్వ‌రినీ న‌మ్మొద్ద‌న్నారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు సునీత చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here