జీవీకే సంస్థ అక్ర‌మాల‌కు అడ్డాగా ముంబై ఎయిర్‌పోర్ట్..

వంద‌ల కోట్ల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో జీవీకే సంస్థపై ఈడీ వేగంగా ద‌ర్యాప్తు జ‌రుపుతోంది. ముంబైతో పాటు హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది.

ముంబై ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఎయిర్‌పోర్టు డెవ‌ల‌ప్‌మెంట్ కుంభ‌కోణంలో జీవీకే సంస్థ వంద‌ల కోట్ల అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈనెల 2వ తేదీన సీబీఐ కేసు న‌మోదు చేసింది. అప్పుడు చేసిన దాడుల్లో కీల‌క స‌మాచారం సేక‌రించారు అధికారులు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నేడు ముంబై, హైద‌రాబాద్‌లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) దాడులు చేస్తోంది. ముంబైలో 6 ప్రాంతాల్లో, హైద‌రాబాద్‌లో 3 చోట్ల జీవీకేకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి.

అస‌లేం జరిగిందంటే ముంబై ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు 2006లో జీవీకే సంస్థ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో జీవీకే గ్రూప్‌కు 50.5 శాతం, 26 శాతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ, మ‌రో 9 ఫారెన్ కంపెనీలు ఒప్పందం కుదుర్చున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో పెద్ద మొత్తంలో నిధులను జీవీకే సంస్థ త‌న సొంత ప‌నుల కోసం వాడుకుంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

395 కోట్ల రూపాయ‌లు త‌న సొంతంగా జీవీకే సంస్థ తీసుకుంద‌ని ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది. ఇక ఎయిర్‌పోర్టు ఆదాయంలో 38.7 శాతం వాటా ఎయిర్‌పోర్టు అథారిటీకి ఇవ్వాలి. ఈ మేర‌కు ఇవి కాకుండా 310 కోట్ల రూపాయ‌లు అక్ర‌మంగా మ‌ల్లించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప‌లువురు అధికారులు కూడా ఈ స్కాంలో ఉన్న‌ట్లు ఈడీ భావిస్తోంది. ఇవే కాకుండా మ‌రో వంద కోట్ల అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ఈడీ అంచ‌నాకు వ‌చ్చింది. మొత్తం అధికారుల‌తో క‌లిసి జీవీకే సంస్థ 805 కోట్ల రూపాయ‌ల మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. బోగ‌స్ బిల్లులు, షెల్ కంపెనీల్లోకి నిధుల మ‌ల్లింపు ప్ర‌క్రియ జ‌రిగింద‌ని అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.‌

ముంబై ఎయిర్ పోర్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ పేరుతో వంద‌ల కోట్ల రూపాయ‌ల ప్ర‌జ‌ల ధ‌నాన్ని జీవీకే సంస్థ త‌న సొంత కంపెనీల‌కు మ‌ల్లించింద‌ని ఈడీ కేసులో ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసింది. ఇందులో భాగంగానే ముంబైతో పాటు హైద‌రాబాద్‌లో దాడులు కొన‌సాగుతున్నాయి. జీవీకే గ్రూప్ చైర్మ‌న్ జీ. వెంక‌ట కృష్ణా రెడ్డి, ఆయ‌న కుమారుడు ముంబై ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు ఎండీ జీ.వి సంజ‌య్ రెడ్డితో పాటు అధికారులు, మ‌రికొంద‌రిపై కేసు న‌మోదైంది. ఈడీ చేస్తున్న దాడులో ప‌లు కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇంత భారీ మొత్తంలో మ‌నీ లాండ‌రింగ్‌కు ఎల్పా పాల్ప‌డ్డార‌న్న దానిపై విచార‌ణ కొన‌సాగ‌నుంది. ఏ ఏ కంపెనీల్లోకి డ‌బ్బులు మల్లించారో విచార‌ణ‌లో తేల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here