గుర‌కే క‌దా అని నిర్ల‌క్ష్యం చేస్తే…. ఇంకా అంతే

గుర‌కే క‌దా అని నిర్ల‌క్ష్యం చేస్తే…. ఇంకా అంతే

సాధార‌ణంగా చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ప‌క్క‌న నిద్ర‌పోయేవారికి ఆ గుర‌క శ‌బ్దం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.   గుర‌క పెట్టే వారికి అది పెద్ద స‌మ‌స్య‌గా అనిపించ‌క‌పోవచ్చు. చాలామంది ఈ గుర‌క స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. గురకే కదా, ఏం చేస్తుందిలే అని అనుకుంటుంటారు. కానీ, గుర‌క పెట్ట‌డం నిద్రలో శ్వాసకు ఆటంకం కలగజేసే (స్లీప్‌ అప్నియా) సమస్యకు సంకేతం కావొచ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ స్లీప్‌ అప్నియాను పట్టించుకోకపోతే పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెజబ్బు వంటి తీవ్రమైన సమస్యల ముప్పు పెరుగుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అంతేకాదు, ఈ గుర‌క వ‌ల్ల ….దిగులు, మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవటం, నోరు ఎండిపోవటం, కుంగుబాటు, నిస్సత్తువ వంటి వాటి బారిన ప‌డే ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, ముక్కు దిబ్బడ, నిద్రపోతున్నప్పుడు నోటితో శ్వాస మందులను పడుకోవటానికి ముందు మద్యం లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవటం వ‌ల్ల‌ గురకకు దారితీయొచ్చు. అయితే, కొన్ని ర‌కాల జాగ్రత్తలు పాటించ‌డం వ‌ల్ల గుర‌క‌ను తగ్గించుకునే అవకాశముంది.

బరువును అదుపులో ఉంచుకోవటం వ‌ల్ల గుర‌కను నియంత్రించ‌వ‌చ్చు. నిద్రపోవటానికి ముందు మద్యం వంటి వాటికి దూరంగా ఉండ‌డం వ‌ల్ల గుర‌క‌ను అరిక‌ట్టవ‌చ్చు. అలర్జీని త‌గ్గించేందుకు ముక్కుతో పీల్చే మందుల‌ను వాడుకోవడం వ‌ల్ల గుర‌య‌ను నివారించ‌వ‌చ్చు. చాలా మందికి నిద్ర‌లో వెల్ల‌కిలా ప‌డుకునే అల‌వాటు ఉంటుంది. అలా కాకుండా, పక్కకు తిరిగి పడుకుంటే అంగిలి భాగం శ్వాస మార్గానికి అడ్డుపడకుండా  ఉంటుంది. దీంతో, గుర‌కకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here