ఇండియన్ క్రికెట‌ర్ల‌కు జీతాలు లేవట

ఇండియాలో ట‌క్కుమ‌ని గుర్తొచ్చే ఆట ఏదంటే క్రికెట్ అని ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే ఇంత‌లా క్రికెట్ అభిమానులు ఇండియాలో ఉన్నారు. అయితే క్రికెట్ ఆట‌గాళ్లు మాత్రం జీతాలు లేకుండా ఉంటున్నారు.

గ‌త ప‌ది నెలలుగా బీసీసీఐ క్రికెట‌ర్ల‌కు జీతాలు ఇవ్వ‌డం లేద‌ని తెలిసింది. 27 మంది ఆట‌గాళ్ల‌కు పోయిన సంవ‌త్స‌రం అక్టోబ‌రు నుంచి ఇప్ప‌టివ‌ర‌కు జీతాలు ఇవ్వ‌లేదు. వీరంతా వార్షిక కాంట్రాక్టులో ఉన్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా జ‌ట్టులోని సీనియ‌ర్ క్రిక‌ట‌ర్లే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఇండియా జ‌ట్టులో ఏ ప్ల‌స్ విభాగంలో విరాట్ కొహ్లీ, రోహిత్ శ‌ర్మా, బుమ్రా ఉన్నారు. వీరంద‌రికీ రూ. 7 కోట్లు వేత‌నాలు ఇవ్వ‌నుంది బీసీసీఐ. ఏ కేట‌గిరి కాంట్రాక్టులో ఉన్న వారికి రూ. 5 కోట్లు, బి కేట‌గిరి కాంట్రాక్టులో ఉన్న వారికి రూ. 3 కోట్లు, సి కేట‌గిరి కాంట్రాక్టులో ఉన్న వారికి రూ. 1 కోటి వేత‌నం ఇవ్వ‌నున్నారు. సంవ‌త్స‌రంలో నాలుగు విడ‌త‌లుగా ఈ మొత్తం వేత‌నం ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ అంద‌జేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here