తాత సమాధి తవ్వుతూ మనవడి మరణం.. తీవ్ర విషాదం

వయోభారంతో మృతి చెందిన తాత సమాధి తవ్వుతూ మనవడు హఠాన్మరణం చెందాడు. స్నేహితులతో కలసి సమాధి తవ్వేందుకు వెళ్లిన మనవడు.. ఎవరైనా చనిపోవచ్చు.. మరో సమాధి తవ్వుదామని సరదాగా చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తాత సమాధి పక్కనే మరో సమాధి తవ్వి మనవడికి కూడా అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన ముజఫ్ఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.

నగరంలోని జన్‌సాత్ ప్రాంతానికి చెందిన మొహహ్మద్ యూసుఫ్(80) వయోభారంతో కాలంచేశారు. యూసుఫ్ అంత్యక్రియల ఏర్పాట్లలో భాగంగా ఆయన మనవడు సలీం(40) అతని స్నేహితులతో కలసి సమాధి తవ్వేందుకు వెళ్లాడు. అక్కడ మాట్లాడుకుంటూ ఎవరైనా చనిపోవచ్చు.. పక్కనే మరో సమాధి తవ్వుదాం అంటూ స్నేహితులతో సరదాగా అన్నాడు. కాసేపటికే ఛాతీనొప్పితో కుప్పకూలిపోయాడు.

Also Read:

హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో స్నేహితులు అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సలీం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తాత సమాధి తవ్వుతూ మనవడు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాత సమాధి పక్కనే మరో సమాధి తవ్వి సలీమ్‌ను ఖననం చేశారు. చనిపోయే ముందు సలీం సరదాగా అన్న మాటలను తలచుకుని స్నేహితులు కుమిలిపోయారు.

సలీమ్ పండ్ల వ్యాపారం చేసేవాడని.. చాలా ఆరోగ్యంగా ఉండేవాడని ఆయన సోదరుడు బాబర్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యం బాగా లేదని తెలిసే మరో సమాధి తవ్వమని ఉంటాడు. అలా హఠాత్తుగా చనిపోతాడని ఊహించలేదని వాపోయాడు. సోదరుడి మరణం షాక్‌కి గురిచేసిందని.. ఆయన తన ఐదుగురు పిల్లలను వదిలి వెళ్లిపోయాడని కన్నీటిపర్యంతమయ్యాడు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here