జమ్మలమడుగులో దారుణం.. చోరీకి వచ్చి అడ్డొచ్చిన యజమాని గొంతుకోసి..

షాపులో చేసేందుకు వచ్చిన దుండగులు అడ్డొచ్చిన యజమాని గొంతుకోసేసిన దారుణ ఘటన జిల్లా జమ్మలమడుగులో చోటుచేసుకుంది. పట్టణంలోని జనరల్ స్టోర్‌లో దొంగతనం చేసేందుకు ఇద్దరు దుండగులు లోపలికి చొరబడ్డారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో చోరీ చేశారు. డబ్బులు సంచిలో వేసుకుని పారిపోతున్న క్రమంలో అలికిడి కావడంతో స్టోర్ యజమాని ఉమామహేశ్వర్ నిద్రలేచి చూశాడు.

షాప్‌లో దొంగలను చూసి అడ్డకునేందుకు యత్నించడంతో దుండగులు ఉమామహేశ్వర్ గొంతుకోసేసి పరారయ్యారు. దొంగతనం చేసేందుకు వచ్చిన వారిని నరసయ్య, దస్తగిరి రెడ్డిగా గుర్తించినట్లు తెలుస్తోంది. యజమాని గొంతుకోసి పారిపోయే క్రమంలో కిందపడి నిందితుడు నరసయ్యకి గాయాలైనట్లు సమాచారం. పట్టణంలో చోరీ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యజమాని ఉమామహేశ్వర్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here