చెన్నైలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య.. మెరీనా బీచ్‌లో తేలిన శవం

తమిళనాడులోని చెన్నైలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. మెరీనా బీచ్‌ సమీపంలో డాక్టర్‌ మృతదేహం తీరానికి కొట్టుకు రావడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. చెన్నై విరుగంబాక్కం శ్యామలా గార్డెన్‌ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌ (34) పోరూరులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకుని.. పళ్ళికరణైలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇంటి నుంచి ఆస్పత్రికి మల్లికార్జున్ బయలుదేరిన కాసేపటికే అతడి తమ్ముడు అజయ్‌ సెల్‌ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది.

Also Read:

తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, దానికి ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆ మెసేజ్‌లో మల్లికార్జున్ పేర్కొన్నాడు. తన కారును సమీపంలోని లైట్‌హౌస్ వద్ద పార్కింగ్ చేశానని చెప్పాడు. ఆ మెసేజ్‌ చూసి కంగారుపడిన అజయ్ వెంటనే మెరీనా బీచ్‌కు వెళ్లగా లైట్‌హౌస్ సమీపంలో కారు కనిపించింది.

Also Read:

దీంతో అతడు సముద్ర తీరంలో చాలాసేపు వెతకగా సాయంత్రం 7గంటల సమయంలో మల్లికార్జున్ మృతదేహం కనిపించింది. దీంతో అజయ్ వెంటనే మెరీనా బీచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మల్లికార్జున్‌ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here