నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. 70ఏళ్ల పూజారి అరెస్ట్

నిత్యం దైవారాధనలో మునిగితేలే పూజారి కీచకుడిగా మారాడు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. తమిళనాడులోని చెన్నై సమీపంలోని పరిధిలో గల దచ్చూర్‌కు చెందిన సుకుమార్(70) అనే వృద్ధుడు ఓదలవాడిలోని జెయినర్ ఆలయంలో సుమారు 25ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశచూపిన సుకుమార్‌ను ఆమె ఇంట్లోకి తీసుకెళ్లాడు.

Also Read:

అక్కడ బాలిక దుస్తులు తొలగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దచ్చూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here