చిత్తూరులో తమిళ యువకుడి దారుణహత్య

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. అలిపిరి సమీపంలోని బాలాజీ టూరిస్టు లింకు బస్టాండు వద్ద ఓ యువకుడు హత్యకు గురైనట్లు అలిపిరి ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ సోమవారం తెలిపారు. పళ్లిపట్టు సమీపం గాజులకండ్రిగకు చెందిన రమేష్‌(25) మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం తిరుపతికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ నిత్యం టూరిస్టు బస్సులు శుభ్రం చేయడం, ప్రైవేటు జీపులకు లోడ్‌ చేయడం చేస్తూ వచ్చే సంపాదనతో జీవిస్తున్నాడు.

Also Read:

అయితే సోమవారం ఉదయం రమేశ్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలమైన ఆయుధాలతో రమేష్‌ తలపై దాడి చేచి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్‌లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here