గోల్డ్ షాపులో దొంగతనం.. ఏం పట్టుకెళ్లారో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

బంగారం షాపులో జరిగిందని తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాపు ఓనర్ మాటలు విని ఆశ్చర్యపోయారు. షాపు నిండా నగలు పెట్టుకుని దొంగ ఏం పట్టుకెళ్లాడో తెలిసి షాక్‌కి గురయ్యారు. కళ్లెదుట ఉన్న కళ్లు చెదిరే ఆభరణాలను వదిలి టీవీ చోరీ చేయడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని పటియాలాలో చోటుచేసుకుంది.

పటియాలాలోని పూరి మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ గోల్డ్ షాపులో చోరీ జరిగింది. షాపు తెరిచి చూసిన యజమాని దుకాణంలో దొంగతనం జరిగిందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు దుకాణం వద్దకు వచ్చి పరిశీలించారు. చోరీకి గురైన వస్తువుల వివరాలు చెప్పాలని అడిగిన పోలీసులు షాప్ ఓనర్ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యానికి గురయ్యారు.

Also Read:

దుకాణంలో ఉన్న ఎల్‌ఈడీ టీవీ చోరీకి గురైందని చెప్పడంతో కంగుతిన్నారు. లక్షల విలువ చేసే ఆభరణాలను వదిలి కేవలం రూ.7 వేల విలువైన టీవీ దొంగతనం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. టీవీ దొంగిలించిన వ్యక్తి బంగారు ఆభరణాలను కనీసం టచ్ చేయకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పక్క దుకాణం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో నిందితుడి కదలికలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. కళ్లెదుట బంగారం ఉన్నా వదిలేసి టీవీ పట్టుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here