గెస్ట్‌హౌస్‌లో గుట్టుగా వ్యభిచారం.. సడెన్‌గా పోలీసులు గది తలుపు తీయడంతో..

లాక్‌డౌన్‌‌తో అన్ని వ్యాపారాలు మూతపడినా యథేచ్ఛగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి గుట్టురట్టు చేశారు. గెస్ట్‌హౌస్‌లో చేస్తున్న ఇద్దరు యువతులు, ఒక విటుడితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. దాడుల్లో గెస్ట్‌హౌస్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్తలాలో జరిగింది.

కపుర్తలా పట్టణంలోని టినీ కాంప్లెక్స్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. బయటి నుంచి షట్టర్లు మూసేసి లోపల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి షట్టర్లు తెరిపించారు. గెస్ట్‌హౌస్ లోపలికి ప్రవేశించి గదులను తనిఖీ చేశారు. ఒక గదిలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువతులు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

పోలీసులు ఒక్కసారిగా గది తలుపులు తీయడంతో అభ్యంతరకర రీతిలో ఉన్న ముగ్గురు వెంటనే బట్టలు వేసుకున్నారు. మిగిలిన గదులను తనిఖీ చేశారు. అనంతరం గెస్ట్‌హౌస్ యజమాని, విటుడు, ఇద్దరు యువతులను అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు. పాత సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు తొలగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here