గల్ఫ్‌లో భర్త.. వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య.. వేములవాడలో విషాదం

బతుకుదెరువు కోసం భర్త దేశం దాటితే వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడలో చోటుచేసుకుంది. పరిధిలోని హన్మాజీపేటకి చెందిన మహిపాల్‌కి సమీపంలోని చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన రాజమల్లు కుమార్తె లత(24)తో మూడేళ్ల కిందట వివాహమైంది. వారికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు.

ఉపాధి కోసం మహిపాల్ గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో కొడుకు, అత్తమామలతో కలసి లత ఇక్కడే ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు.. సడెన్‌గా లత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రాజమల్లు, బంధువులు అత్తారింటికి చేరుకున్నారు.

Also Read:

వరకట్న వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఆరోపించాడు. అదనపు కట్నం కోసం అత్తమామలు వేధింపులకు గురిచేయడం వల్లే లత బలవన్మరణానికి పాల్పడిందన్నారు. మృతురాలి తండ్రి రాజమల్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here