క్లాస్‌మేట్ మాట్లాడటం లేదని ఉరేసుకున్న యువతి.. షాక్‌లో తల్లి

స్నేహితులు తనతో మాట్లాడటం లేదన్న మనస్తాపంతో ఓ యువతి చేసుకున్న ఘటన జిల్లా కలకడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందిరమ్మకాలనీకి చెందిన అంజనాదేవి మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ సచివాలయంలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె కుమార్తె రంజిత(18) విజయవాడలోని చైతన్య కళాశాలలోని భవిష్య క్యాంపస్‌లో నీట్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా క్యాంపస్ మూసివేయడంతో కొద్దిరోజుల క్రితం రంజిత ఇంటికి చేరుకుంది.

Also Read:

ఈ క్రమంలోనే రంజిత తన క్లాస్‌మేట్ అయిన ఓ విద్యార్థితో రోజూ ఫోన్లో మాట్లాడేది. అయితే మూడు రోజులుగా అతడు ఫోన్ చేయడం లేదు. ఆమె చేసినా ఆ యువకుడు ఫోన్ ఎత్తడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రంజిత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం వేళ తల్లి విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా రంజిత ఫ్యాన్2కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here