కోడికూరలో ఉప్పు తక్కువైందని.. భార్య గొంతు నులిమి చంపేశాడు

కోడి కూరలో కూరలో ఉప్పు తక్కువ వేసిందన్న కోపంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చేళూరుకు చెందిన బాలచంద్ర(28) ప్రైవేట్ బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మధుర(24) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 నెలల మగబిడ్డ ఉన్నాడు. ప్రస్తుతం గర్భవతి అయిన మధుర కొద్దిరోజుల క్రితం బాగేపల్లి తాలూకా హొసహుడ్యలోని పుట్టింటికి వచ్చింది.

Also Read:

ఈలోగా లాక్‌డౌన్‌ విధించడంతో మధుర పుట్టింట్లోనే చిక్కుకుపోయింది. భార్యను చూసేందుకు బాలచంద్ర ఆదివారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చాడు. మద్యం తాగుతూ చికెన్ కర్రీ వండాలని భార్యకు చెప్పాడు. దీంతో మధుర కోడికూర వండి భర్తకు వడ్డించింది. మద్యం మత్తులో ఉన్న బాలచంద్ర కూరలో ఉప్పు తక్కువైందని భార్యతో గొడవపడ్డాడు. రాత్రి గదిలో మరోసారి ఇదే విషయమై గొడవపడిన అతడు ఆవేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు.

Also Read:

అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు తాను పడుకున్న సమయంలో మధుర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని బాలచంద్ర ఆమె కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే వారు చేళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here