కేరళలో మళ్లీ కొత్త కేసులు..

కే రళలో వరసగా రెండు రోజుల పాటు ‘0’ కరోనా కేసులు నమోదైన ఉత్సాహం నీరుగారిపోయింది. మంగళవారం (మే 5) కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37కు పెరిగింది. తాజా కేసులతో కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు చేరుకోగా.. ఇప్పటికే 462 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కేరళలో మంగళవారం కరోనా సోకిన ముగ్గురు బాధితులూ వయనాడ్ జిల్లాకు చెందినవారేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోనా బాధితుల్లో ఎవరూ డిశ్చార్జ్ కాలేదని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని ఆయన మంగళవారం (మే 5) సాయంత్రం మీడియాకు తెలిపారు.

కేరళలో ప్రస్తుతం 21,342 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సీఎం పినరయి విజయన్ తెలిపారు. మరో 21,034 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వాసులను 14 రోజుల హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నారు.

కేరళలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నట్లే కనిపించినా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. బాధితుల్లో 92.5 శాతం మంది కోలుకున్నారు. కేరళలో కరోనా కారణంగా నాలుగు నెలల ఓ పసికందు సహా ముగ్గురు మాత్రమే మరణించారు. భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత ఆమె కోలుకుంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here