కూతురి కళ్లెదుట తండ్రిని రెండు ముక్కలుగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కి..

కూతురి కళ్లెదుటే కన్నతండ్రి తన నరికి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కారులో వచ్చిన గ్యాంగ్ బైక్‌పై కూతురితో వెళ్తున్న రౌడీషీటర్‌ని అడ్డగించి కత్తులతో విచక్షణా రహితంగా నరికారు. రెండు ముక్కలుగా నరికేసిన దుండగులు తలతో నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన జిల్లాలోని శ్రీరంగంలో జరిగింది.

శ్రీరంగం పట్టణంలోని డ్రైనేజ్ వీధికి చెందిన రౌడీషీటర్ చంద్ర మోహన్(38) అలియాస్ తలైవెట్టి చంద్రు దారుణ హత్యకు గురయ్యాడు. తన కూతురితో కలసి బైక్‌పై వస్తున్న చంద్రుని ముగ్గురు వ్యక్తులు కారులో వెంబడించారు. దేవి థియేటర్ సమీపంలో చంద్రు బైక్‌ని అడ్డగించి అతనిపై ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. కూతురి కళ్లెదుటే కిరాతకంగా నరికి చంపేశారు. శరీరాన్ని రెండు ముక్కలుగా నరికేశారు.

Also Read:

అత్యంత దారుణంగా తలను మొండెం నుంచి వేరుచేశారు. చంద్రు తలతో నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయారు. ఈ దారుణ ఘటనతో స్థానికులు హడలిపోయారు. కళ్లెదుటే తండ్రిని చంపేయడంతో చిన్నారి షాక్‌కి గురైంది. దుండగులు ఆమెను వదిలేశారు. చంద్రుపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రత్యర్థులే అతనిని అంతమొందించినట్లుగా అనుమానిస్తున్నారు. హత్య ఎందుకు చేశారన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here