కాంక్రీట్ మిక్సర్‌లో 18 మంది వలస కూలీలు.. విషాద దృశ్యాలు

రో డ్ల వెంట అవే విషాద దృశ్యాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఊరట కలిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. స్వస్థలాలకు చేరుకునేందుకు కొంత మంది సాహసాలు చేస్తున్నారు. ఎలాగైనా స్వగ్రామానికి చేరుకోవాలని యూపీకి చెందిన కొంత మంది కాంక్రీట్ మిక్సర్ ఎంచుకున్నారు. ఇరుకుగా ఉండే ఆ కాంక్రీట్ మిక్సర్‌లో ఏకంగా 18 మంది కూలీలు ఎండలో, ఊపిరి కూడా సలపలేని పరిస్థితుల్లో మహారాష్ట్ర నుంచి యూపీకి వెళుతుండటం వారి ఆవేదనకు అద్దం పడుతోంది. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తుండటం చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.

మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో వెళుతోన్న ఓ కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్కును మధ్యప్రదేశ్‌ పోలీసులు శనివారం (మే 2) ఉదయం ఇండోర్, ఉజ్జయినీ సరిహద్దుల వద్ద నిలిపేశారు. ట్రక్కు డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో డ్రమ్ తెరిపించి చూశారు. అందులో వలస కూలీలు ఉన్నట్లు గుర్తించారు. మిక్సర్ నుంచి ఒక్కొక్కరుగా 18 మంది కూలీలు కిందకు దిగారు.

Must Read:

ఇండోర్‌కు 35 కి.మీ. దూరంలో ఉన్న ఓ చెక్‌ పాయింట్‌ వద్ద పోలీసుల తనిఖీలో ఈ విషయం వెలుగుచూసింది. ఇరుకుగా ఉండే రంధ్రంలోంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 18 మందిలో 14 మంది యూపీకి చెందిన వలస కూలీలు కాగా.. నలుగురు ట్రక్కు యజమానికి చెందిన కూలీలని పోలీసులు వెల్లడించారు. వీరంతా శుక్రవారం రాత్రి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌ మీదుగా లక్నోకు బయల్దేరారు.

కూలీలను పట్టుకున్న పోలీసులు వారిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల అనంతరం వారిని స్వస్థలాలకు పంపించేదుకు బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. లారీ డ్రైవర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఓ వైపు కూలీల తరలింపునకు కేంద్రం చర్యలు చేపడుతున్నప్పటికీ వారు యథావిధిగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here