కరోనా వైరస్‌కు ఇక వ్యాక్సిన్ రాదేమో..!

ప్ర పంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఇక వ్యాక్సిన్‌ను ఎప్పటికీ చూడలేమా? ఈ ప్రశ్నకు లేకపోవచ్చనే సమాధానం చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికీ అనేక దేశాల్లో 100కు పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నా, వాటిలో రెండు మనుషులపై ప్రయోగాల దశకు చేరుకున్నా.. ఆశాజనక ఫలితాలైతే కనిపించడంలేదని చెబుతున్నారు. ఈ మాటలెవరో అల్లాటప్పా వ్యక్తులు చెప్పారనుకుంటే పొరపాటే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్-19 నిపుణులు డాక్టర్ డేవిడ్ నబారో చెప్పారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

భయంకరమైన వ్యాధులు హెచ్‌ఐవీ, డెంగ్యూకు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నా వీటికి ఔషధాన్ని కనుక్కోలేకపోయారు. ఈ జాబితాలో కోవిడ్-19 కూడా చేరుతుందేమోనని చాలా మంది కలవరానికి గురవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు కూడా ఇవే సంకేతాలను ఇస్తున్నాయి.

అదే జరిగితే మరి కొంత కాలం కరోనా వైరస్‌తో కలిసి జీవించడం తప్పదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు ఈ మహమ్మారితో కలిసి జీవించమెలాగో నేర్చుకోవాలి. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి.

Must Read:

‘కొన్ని వ్యాధులకు నేటికీ వ్యాక్సిన్ లేదు. వాటికి వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం కూడా లేదు. కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా ఇంతేనేమో. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా సెఫ్టీ పరీక్షలన్నింటిలో నెగ్గుతుందన్న విశ్వాసం లేదు’ అని డేవిడ్ నబారో అభిప్రాయపడ్డారు.

హెచ్‌ఐవీ మహమ్మారికి వ్యాక్సిన్ కోసం నాలుగు దశాబ్దాలుగా ప్రపంచం ఎదురుచూస్తోంది. ఎయిడ్స్‌ కారణంగా ప్రపంచంలో ఇప్పటికే 32 మిలియన్ల మరణాలు సంభవించాయి. డెంగ్యూ జ్వరానికి కూడా వ్యాక్సిన్ కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఏటా 4 లక్షల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. కొన్ని దేశాలు డెంగ్యూ నివారణకు ముందస్తు వ్యా్క్సిన్‌ను కనుగొన్నా.. వాటితో ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఆందోళనకు గురిచేసే విషయాలే. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19కు మాత్రం ఇలా జరగకుండా.. శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించాలని కోరుకుందాం..

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here