కరోనా యోధులకు నౌకాదళం సలాం.. తీరంలో అపురూప దృశ్యం

కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు భారత నౌకాదళం, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సంఘీభావం ప్రకటించింది. యుద్ధనౌకలను విద్యుద్దీపాలతో అలంకరించి తీర ప్రాంతాల్లో మోహరించింది. ఆదివారం (మే 3) రాత్రి 7 గంటల నుంచి విశాఖపట్నం, చెన్నై, ముంబై, తిరువనంతపురం తీరాల్లో ఈ యుద్ధనౌకలు కాంతులీనుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ట్విటర్ ద్వారా విడుదల చేశారు.

వైరస్ కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న కరోనా వారియర్స్‌కి నౌకాదళ సిబ్బంది గౌరవవందనం సమర్పించింది. ‘Thank You’ అంటూ మానవహారం ఏర్పాటు చేసి జేజేలు పలికింది.

దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణకు డాక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు లాక్‌డౌన్ విధుల్లో పోలీసులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరందరికీ భారత సైన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం ఉదయం దేశవ్యాప్తంగా కోవిడ్-19 ఆస్పత్రులపై భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు పూలవర్షం కురిపించాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here