కరోనా ‘మహా’ టెర్ర‌ర్‌.. ముంబైలో 4000 దాటిన కేసులు

క‌రోనా వైర‌స్ మ‌హారాష్ట్ర‌లో వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరువేల‌కుపైగా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. గురువారం ఒక్క‌రోజే రాష్ట్ర‌వ్యాప్తంగా 778 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 6,400కుపైగా చేరింది. 14 మంది తాజాగ మ‌ర‌ణించ‌గా.. మొత్తం మృతుల సంఖ్య 280కిపైగా చేరింది. ఇక రాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ప‌రిస్థితి ఘోరంగా తయారైంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో మూడింట రెండు వంతులు ఈ న‌గ‌రంలోనే న‌మోద‌య్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 4000 దాటిపోయింది.

Must Read:

ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంది. 8 ల‌క్ష‌ల‌కుపైగా జ‌నం నివాస‌ముంటున్న ఈ ప్రాంతంలో ఇప్ప‌టికే 214 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ముంబై న‌గ‌రాన్ని హాట్‌స్పాట్‌గా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. న‌గ‌ర‌పాల‌క సంస్థ ఇప్ప‌టికే 813 కంటైన్‌మెంట్ ప్రాంతాలుగా ప్ర‌క‌టించింది.

Must Read:

మ‌హారాష్ట్ర‌లో మోరాలిటీ (మ‌ర‌ణాల రేటు)ను త‌గ్గించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే తెలిపారు. అలాగే డ‌బ్లింగ్ పీరియ‌డ్‌ను పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు. తాజాగా రెండు కేంద్ర బృందాల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ..ముంబై, పుణేల‌లో వైర‌స్ తీవ్ర‌త‌ను అడ్డుక‌ట్ట వేయ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here