కరోనా మరణాల్లో ఆ వయసువాళ్లే అధికం.. రికవరీ రేటు మాత్రం భారీగా ఉంది

దేశంలో చోటుచేసుకుంటున్న మరణాల్లో సగానికి కంటే ఎక్కువ మంది 60 ఏళ్లు దాటినవారే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 60 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్నవారే ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం.. కరోనా మరణాల్లో మొత్తం 42 శాతం మంది వీళ్లే ఉన్నారు. 45 నుంచి 60 ఏళ్లవారికి ముప్పు తక్కువగా ఉంది. కరోనా మరణాల్లో వీరు 34 శాతంగా ఉన్నట్టు తెలిపింది. డయాబెటిస్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నవారిలో మరణాల రేటు ఇంకా ఎక్కువగా ఉంది. ఈ రోగులు మొత్తం మరణాలలో 78 శాతంగా ఉన్నట్టు తెలియజేసింది. అయితే, గత పదిహేను రోజులతో పోల్చితే కోలుకుంటున్నవారి శాతం పెరగడం శుభపరిణామం. గురువారం నాటికి కోలుకున్న కోవిడ్-19 బాధితుల శాతం 25.19గా నమోదయ్యింది. ఇదే రెండు వారాల కిందట 13.06 శాతంగా ఉంది.

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌తో 1,057 మంది ప్రాణాలు కోల్పోగా, 8,372 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా మరణాల రెటు 3.2 శాతం కాగా వీరిలో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. గురువారం సాయంత్రం వరకు 33,610 మంది వైరస్ బారినపడగా.. 24,162 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఇక, 45-60 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో మరణాలలో గణనీయమైన వాటా ఉండగా, 45 ఏళ్లలోపు వారు 14 శాతం ఉన్నారు. మొత్తం మరణాలలో 75 ఏళ్లు దాటిన వారు 9.2% ఉన్నారు. వృద్ధాప్య రోగులు అధిక ప్రమాదంలో ఉన్నప్పటికీ, మరణాల సంఖ్య తక్కువగా ఉండటం విశేషం. వైరస్ బారినపడ్డవారి వయసు గురించి విశ్లేషణను ప్రభుత్వం వెల్లడించలేదు. ఏప్రిల్ 6 న వెల్లడించిన సమాచారం ప్రకారం.. యువత పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారని, 21-40 ఏళ్ల వారు దాదాపు 42 శాతం మందికి కరోనా సోకగా, 41 నుంచి 60 ఏళ్లవారు మరో 32.82% ఉన్నారు.

ఏది ఏమైనప్పటికీ వైరస్ బారినపడ్డ యువతలో మరణాలు రేటు తక్కువగా ఉంది. వీరిలో రికవరీ రేటు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక తెలియజేస్తుంది. అయితే 60 ఏళ్లు పైబడినవారు సహఅనారోగ్యంతో ఉన్నవారు అధిక మరణాల రేటుతో సంక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ వృద్ధుల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటం విశేషం.

వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున సాధారణంగా అనారోగ్యం బారినపడతారు. కాబట్టి వీరి కరోనావైరస్ సోకకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా, యువకులు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాకౌడౌన్ ఎత్తివేసిన తర్వాత పనులు, కార్యాలయాలకు వెళతారు. కుటుంబంలో వ్యాధి సంక్రమణను నిరోధించాలంటే వయసుపైబడినవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here