కరోనా ఉందని ‘దొంగ’ నాటకం.. పోలీసులకు చుక్కలు చూపించి పరార్

కరోనా వైరస్ పేరుతో ఓ కరడుగట్టిన నేరస్థుడు పోలీసుల బారి నుంచి తప్పించుకుని పరారైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అందరినీ నమ్మించిన ఖైదీ అదనుచూసి పరారయ్యాడు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వైంకుంఠం ప్రాంతానికి చెందిన మాయండి అనే వ్యక్తి చాలా ఏళ్లుగా అనేక దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఆళ్వార్ తిరునగర్‌లో దోపిడీకి పాల్పడిన మయాండిని ఈ నెల 28వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:

అనంతరం అతడిని తూత్తుకుడి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలసులు తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టేలోని సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వాహనంలోకి ఎక్కినప్పటి నుంచి మయాండి కరోనా రోగిలా నటించడం మొదలుపెట్టాడు. దగ్గుతూ, తుమ్ముతూ పోలీసులపై పడటంతో వారంతా భయపడి అతడికి దూరంగా ఉన్నారు. అతడికి పరీక్షలు చేయించేందుకు రాత్రి 7 గంటల సమయంలో పాళాయం కోట్టే మార్గంలో ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు దూరంగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న మయాండి సమయం చూసి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు.

Also Read:

దీంతో షాకైన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. తూత్తుకూడి, తిరునల్వేలి పరిసర ప్రాంతాల్లో ఉన్న 25 చెక్ పోస్టులను అప్రమత్తంగా చేశారు. పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న మాయండి వేందనాకులం నదిలో దూకి ఈదుకుంటూ రహస్య ప్రదేశానికి వెళ్లిపోయాడు. దీంతో ‘మాయండి వాంటెడ్’ అంటూ పోలీసులు వాట్సాప్ గ్రూపులో అతడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. దీంతో పాటు మయాండితో కలిసి వాహనంలో ప్రయాణించిన నలుగురు పోలీసులకు ఉన్నతాధికారులు వైద్య పరీక్షలు చేయించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here