చికెన్ ధరపై వివాదం.. యజమానిని కొట్టి చంపిన కస్టమర్

చిన్నపాటి వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జాంగీర్‌పురి ప్రాంతంలో జరిగింది. మార్కెట్‌ రేటు కంటే ఎక్కువ ధరకు చికెన్ అమ్ముతున్నారన్న అంశంపై తలెత్తిన వివాదంలో చికెన్ షాపు యజమాని ప్రాణం కోల్పోయాడు. పశ్చిమ బెంగాల్‌లోని మదీనాపూర్ జిల్లా కేశర్‌పూర్ జల్పాయ్ గ్రామానికి చెందిన చెందిన షిరాజ్‌(35) అనే వ్యక్తి బతుకు దెరువు కోసం వచ్చి చేపల వ్యాపారం చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా షాపు మూత పడటంతో తన ఇంటి వద్దనే చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకుని చికెన్ విక్రయిస్తున్నాడు.

Also Read:

ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం షా ఆలమ్ అనే వ్యక్తి చికెన్ కొనుగోలు కోసం షిరాజ్ షాప్‌కు వచ్చాడు. వేరే చోట కంటే ఎక్కువగా ఎందుకు అమ్మతున్నావని అతడు షిరాజ్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో షిరాజ్ కింద పడిపోయాడు. ఈ గొడవ గురించి తెలుసుకున్న షా ఆలమ్ సోదరులు అక్కడికి చేరుకుని షిరాజ్‌ను కత్తులు, ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు.

Also Read:

స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని షిరాజ్‌ను మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తలలించారు. అతడిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు షా ఆలమ్‌తో పాటు అతడి సోదరులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here