కరోనా అనుమానితుల స‌మ‌చారామిస్తే న‌జ‌రానా: బీజేపీ ఎంపీ

(కోవిడ్-19) అనుమానితుల వివ‌రాలు చెబితే బహుమతి ఇస్తానని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌లీమ్‌పూర్ ఎంపీ ర‌వీంద్ర కుష్వాహా ప్ర‌క‌టించారు. త‌బ్లిగీ జ‌మాత్‌తోపాటు విదేశాల నుంచి వ‌చ్చిన‌వారు క‌రోనా పరీక్ష‌లు చేసుకోకుండా త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వాహకులుగా మారుతున్నారని తెలిపారు. అలాంటి ‌వారి స‌మాచార‌మిస్తే రూ.11వేల‌ను బహుమతిగా ఇస్తాన‌ని తెలిపారు. గ‌తనెల‌లో ఢిల్లీలో మర్క‌జ్ త‌బ్లిగీ జ‌మాత్ జ‌రిగిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ జ‌మాత్‌కు వెళ్లి వ‌చ్చిన కొంద‌రు అధికారులకు సమాచారమివ్వలేదు.

Must Read:

అలాగే విదేశాల నుంచి వ‌చ్చిన వారు త‌మ ట్రావెల్ హిస్ట‌రీని దాచి పెట్టి, క‌రోనా వ్యాప్తికి ప‌రోక్ష కార‌కులవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కుష్వాహా ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. వీరి జాడ తెలిపిన వారికి పైన చెప్పిన విధంగా బ‌హుమ‌తి అందించ‌నున్న‌ట్లు ఆయన ప్ర‌క‌టించారు. మ‌రోవైపు స‌లీంపూర్ నియోజ‌క‌వ‌ర్గం డియోరియా జిల్లాలో భాగం కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు ఈ జిల్లాలో ఒక్క క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here