కన్నతండ్రి గొంతుకొరికి.. మర్మాంగాన్ని నరికేసి దారుణ హత్య.. సైకో కొడుకు వీరంగం

కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా గొంతుకొరికి చంపేశాడో సైకో. తండ్రితో గొడవపడి క్రూరంగా ప్రవర్తించాడు. గొంతు నుంచి రక్తం కారుతున్న తండ్రిని లాక్కొచ్చి మర్మాంగాన్ని నరికేసి అమానుషంగా హత్య చేశాడు. అనంతరం సినిమా డైలాగులు చెబుతూ వింత చేష్టలతో వీరంగం వేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకూ అలవికాలేదు. అతనిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.

నగరంలోని హుద్‌కేశ్వర్ ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ విక్రాంత్ పిల్లేవర్ తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విక్రాంత్.. అమాంతం తండ్రి విజయ్(55) గొంతు కొరికేశాడు. పీకపట్టుకుని పళ్లతో బలంగా కొరకడంతో తీవ్రగాయాలై రక్తం ధారకట్టింది. అనంతరం మరింత క్రూరంగా రెచ్చిపోయాడు.

Also Read:

తండ్రిని ఇంటి వరండాలోకి లాక్కొచ్చి ఆయన మర్మాంగాలను నరికేశాడు. ముక్కలుముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా చంపేశాడు. అనంతరం సినిమా డైలాగులు చెబుతూ సైకోలా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన తల్లి, చెల్లిని కూడా బెదిరించడంతో వారు భయపడిపోయి దూరంగా ఉండిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

నిందితుడు విక్రాంత్‌ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ పోలీసులకు కూడా చుక్కలు చూపించాడు. చివరికి ఐదుగురు పోలీసులు కలిసి అతనిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. తీవ్రంగా శ్రమించి విక్రాంత్ చేతులు కట్టేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. కన్నతండ్రి దారుణంగా హత్య చేసిన నేరం కింద అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here