ఐదు రోజుల్లో 70 రైళ్లు..స్వస్థలాలకు 80వేల మంది వలసజీవులు

గడచిన ఐదు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు 70కిపైగా శ్రామిక్స్ స్పెషల్ సర్వీనుల నడిపి, దాదాపు 80,000 మంది వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులను వారి వారి స్వరాష్ట్రాలకు తరలించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. సోమవారం వరకు 55 ప్రత్యేక రైళ్లు గమ్యస్థానాలకు చేరాయని, మంగళవారం నాడు సమారు మరో 30 రైళ్లు బయలుదేరాయని పేర్కొంది. బెంగళూరు, సూరత్, సబర్మతి, జలంధర్, కోటా, ఎర్నాకులం సహా పలు ప్రధాన నగరాల్లోని స్టేషన్‌ల నుంచి ఇవి బయలుదేరాయి. ఒక్క రైల్లో కనీసం 1,000 మంది ప్రయాణికులను తరలిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రాల డిమాండ్ మేరకు శ్రామిక్ రైళ్లు నడపనున్నామని స్పష్టం చేసింది.

ఇలాంటివి 500 రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బీహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైళ్ల టిక్కెట్ డబ్బులకు సంబంధించిన ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని తెలిపారు.

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్, బీహార్‌లు తమ రాష్ట్రం నుంచి వెళ్లే వలస కార్మికులు, వచ్చేవారికి రైల్వే ప్రయాణ బాధ్యత తామే వహిస్తామని స్పష్టం చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తమ రాష్ట్రం నుంచి వెళ్లే వారికి టిక్కెట్ డబ్బు చెల్లించడానికి అంగీకరించినట్టు తెలిపారు. ఇదే బాటలో గుజరాత్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు పయనించనున్నాయి.

ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆ అధికారి తెలిపారు. ప్రయాణీకులను పంపడం లేదా తీసుకురావడం రాష్ట్రాల ప్రధాన బాధ్యతని అన్నారు. ఒక రాష్ట్రం నుంచి రైలు వెళుతుంటే, టికెట్ చెల్లించడానికి సిద్ధంగా లేకపోతే కొంత విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది.. ఇలాంటి సందర్భాల్లో కూడా సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాం అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here