ఏఎన్‌ఎం గొంతుకోసి చంపేసిన భర్త.. కడపలో దారుణం

వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యని దారుణంగా చంపేశాడో కసాయి భర్త. అతికిరాతకంగా ఆమె గొంతుకోసి ప్రాణాలు తీశాడు. జిల్లా జమ్మలమడుగులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న మసీదు సమీపంలో నివాసం ఉంటున్న ఏఎన్‌ఎం పబ్బతి పుష్పలత(35) దారుణ హత్యకు గురైంది. కత్తితో ఆమె గొంతుకోసం దారుణంగా హతమార్చాడు భర్త.

పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న పుష్పలతకి జమ్మలమడుగుకి చెందిన సుమన్‌తో పదేళ్ల కిందట వివాహమైంది. గతంలో పుష్పలత పెద్దముడియం మండలంలోనే కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సుగా పనిచేసేది. ఇటీవల గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా ఎంపికైంది. అయితే గత కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలసి పుష్పలత మసీదు సమీపంలో నివాసం ఉంటోంది.

Also Read:

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన సుమన్ నిద్రిస్తున్న భార్యని దారుణంగా హత్య చేశాడు. కత్తితో కిరాతకంగా ఆమె గొంతుకోసి చంపేశాడు. మహిళ దారుణ హత్య విషయం జమ్మలమడుగులో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంటి పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here