ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌కు షాక్‌.. కేంద్రం విచార‌ణ షురూ

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న‌వేళ ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ (పీకే)‌.. ఢిల్లీ నుంచి కోల్‌క‌తాకు ప్ర‌యాణించార‌నే వార్త‌ల‌పై కేంద్రం విచార‌ణ ప్రారంభించింది. ఇటీవ‌లే అత‌ను స‌రుకు ర‌వాణా విమానం ద్వారా కోల్‌క‌తాకు వెళ్లాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో దీనిపై విచార‌ణ ప్రారంభిస్తున్న‌ట్లు కేంద్ర విమానాయ‌న శాఖ వెల్ల‌డించింది. గ‌త మూడు రోజులుగా ఈ రెండు మార్గాల గుండా ప్ర‌యాణించిన విమాన‌యాన సంస్థ‌ల‌ను ఈ విష‌యంపై విచారించ‌మ‌ని తెలిపింది.

Must Read:

అయితే ప్ర‌శాంత్ త‌మ విమానాల్లో ప్ర‌యాణించ‌లేద‌ని స‌ద‌రు సంస్థ‌లు వెల్ల‌డించిన‌ట్లు కేంద్రం తెలిపింది. మ‌రోవైపు రెండు న‌గ‌రాల విమ‌నాశ్ర‌యాల్లోని సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు పేర్కొంది. త్వ‌రంలోనే డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ దీనిపై నివేదిక అందించ‌నుంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Must Read:

క‌రోనా వైర‌స్ సంక్షోభం వేళ విప‌క్షాల నుంచి ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌ల‌కు త‌గిన బ‌దులిచ్చేందుకు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. పీకే సాయం కోరార‌ని ప‌లు క‌థ‌నాల్లో వెల్ల‌డైంది. ఈక్ర‌మంలో అత‌ను డిల్లీ నుంచి కోల్‌క‌తాకు కార్గో విమానంలో చేరుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ ప్రారంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here