ఎనిమిదో తరగతి బాలిక రేప్, హత్య.. పొలాల్లోకి లాక్కెళ్లి అమానుషం

కొన్నేళ్ల కిందట తండ్రి మరణించాడు. ఆ షాక్‌తో తల్లి తన ముగ్గురు బిడ్డలను వదిలేసి ఎటో వెళ్లిపోయింది. మేనమామ పంచన చేరి ఎలాగో బతుకీడుస్తున్న విధి వంచితురాలిపై కామాంధులు రెచ్చిపోయారు. అత్యాచారానికి తెగబడ్డారు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను లాక్కెళ్లి దారుణంగా చేసి.. కిరాతకంగా చంపేశారు. ఈ అమానుష ఘటన యూపీలోని ఆగ్రాలో చోటుచేసుకుంది.

ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను రేప్ చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన బాలిక హత్యాచారానికి గురైంది. బాలికను పొలాల్లోకి లాక్కెళ్లిన దుండగులు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గొంతునులిమి అమానుషంగా హత్య చేశారు. బయటికి వెళ్లిన బాలిక ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించగా సమీప పొలాల్లో విగతజీవిగా కనిపించింది.

Also Read:

బాలిక ఒంటిపై బట్టల్లేకుండా ఆమె మృతదేహం నగ్నంగా పడి ఉంది. లోదుస్తులు, ఆమె బట్టలు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాలికను రేప్ చేసి హత్య చేశారన్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించారు. లోదుస్తులు, ఆమె బట్టలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఎనిమిదో తరగతి బాలికపై హత్యాచారం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కొన్నేళ్ల కిందట బాలిక తండ్రి మరణించాడు. ఆ షాక్‌తో ఆమె తల్లి అదృశ్యమైంది. బిడ్డలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది. వారి ముగ్గురు పిల్లలు మేనమామ ఇంట్లో ఉంటున్నారు. ఇంతటి దీన పరిస్థితిలో ఎలాగోలా బతుకీడుస్తున్న విధి వంచితురాలిపై హత్యాచార ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఉరి తీయాలని బాలిక మేనమామ డిమాండ్ చేశారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here