ఉష్ణోగ్రత పెరిగితే కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం.. రెండింటి మధ్య సహసంబంధం: నీరి స్టడీ

ఉష్ణోగ్రత పెరిగితే వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుదల, కరోనా వైరస్ వ్యాప్తికి మధ్య 85 శాతం చాలా బలమైన సహసంబంధం ఉదని నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎంపిక చేసిన నగరాల్లో నీరి ఈ అధ్యయనం నిర్వహించింది. సీఎస్ఐఆర్‌కు చెందిన నీరి.. మ్యాథమెటికల్ మోడల్‌ను అనుసరించి అధ్యయనం నిర్వహించింది. కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాలు, భాతర వాతావరణ శాఖ నుంచి ఉష్ణోగ్రతలకు సంబంధించి డేటాను ప్రామాణికంగా తీసుకుని ఈ అధ్యయనం చేపట్టింది.

సరాసరి వాస్తవ ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ధ్రతకు, మహారాష్ట్ర, కర్ణాటకలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులకు గల సంబంధాన్ని చేసింది. ఈ రెండు రాష్ట్రాలలో ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత స్థూల విలువలు పరిగణనలోకి తీసుకుంటే రోజువారీ సగటు ఉష్ణోగ్రత 25 ° C లేదా, అంతకంటే ఎక్కువ పెరుగుదల కోవిడ్ -19 కేసులలో తగ్గింపుకు కారణమైందని తమ పరిశోధనలో తేలిననట్టు పేర్కొంది.

ఏది ఏమైనప్పటికీ దేశంలో వేడి వాతావరణం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనం సూచించించింది. అయితే, సామాజిక దూరం, లాక్‌డౌన్ లాంటి చర్యలు మాత్రం ఉష్ణోగ్రత, తేమ వంటి పర్యావరణ కారకాల ప్రయోజనాలను మించి ఉంటాయి. నీరి సెంటర్ ఫర్ స్ట్రాటిజీక్ అర్బన్ మేనేజ్‌మెంట్ రిసెర్చ్ విభాగం శాస్త్రవేత్త హేమంత్ భేర్వానీ మాట్లాడుతూ.. ‘కోవిడ్-19 వ్యాప్తిపై ఉష్ణోగ్రత, తేమ ప్రభావం’పై మాత్రమే దృష్టి పెట్టలేదని లేదన్నారు. సామాజిక దూరం కూడా ఈ అధ్యయనంలో ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలిపారు.

ప్రాణాంతకమైన కోవిడ్ -19 అంటు వ్యాధి కావడంతో అధిక జనాభా కలిగిన భారతదేశంలో సామాజిక దూరాన్ని పాటించకపోతే అధిక ఉష్ణోగ్రత లాంటి అంశాల ప్రయోజనాలు కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here